Tuesday, 24 September 2013

మద్యపాన నిషేదమే తక్షణ కర్తవ్యం

ఇటీవల జరుగునటువంటి కొన్ని దారుణమైన సంగటనలు క్రైస్తవ లోకాన్ని మన సమాజాన్ని కుదిపివేసాయి.2013 ఏప్రిల్ 10 న తెనాలి లో సునిలా అనే క్రైస్తవ మహిళా తన కూతురు ఇద్దరు కల్సి మార్కెట్ కి వెళ్లి వస్తునప్ప్పుడు తగిన మత్తులో యువకులు తెనాలి నడిబొడ్డున  తల్లి కళ్ళముందే కూతురిని వేదించడానికి ప్రయత్నించడం చేస్తే తల్లి అడ్డుకుంటే ఆ తగిన మత్తులో ఉన్నటువంటి యువకులు తల్లిని అతి దారుణంగా కన్నా కూతురి కళ్ళముందే లారి కిందకి తోసివేస్తే వెంటనే ఆమె మరణించినటువంటి సంగటన తెనాలి లో క్రైస్తవ లోకాన్ని మొత్తాన్ని కూడా కుదిపివేసింది .చాలా బాధకరమైనటువంటి విషయం .కేవలం క్రైస్తవ లోకమే కాదు మనవ సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి .ఏప్రిల్ 18 న పునాదిపాడు గ్రామానికి చెందిన క్రైస్తవ సహోదరుడు ,సహోదరి ఇద్దరు కూడా సువార్త కూడికలకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న మద్యం షాపు దగ్గర తాగిన మత్తులో ఉన్నటువంటి యువకులు ఆ యవ్వనస్తులైనటువంటి స్వప్న అనే సహోదరిని వేదించడానికి ప్రయత్నించడం జరిగింది.అటువంటి సమయం లో పక్కనే ఉన్న సహోదరుడు రవితేజ అడ్డుకోనబోతే అతనిని మోటారు సైకిళ్ళ తో గుద్దివేయడం జరిగింది .అతను వెలికిల పది తలకి గాయమై చనిపోయాడు .మే ౩ వ తారికున హైదరాబాద్ సమీపం లో ఉన్న కీసర అనే మండల హెడ్ క్వార్టర్ లో అంటోని అనే దళితక్రైస్తవ యువకుని కుటుంబం మీద కీసర లో ఉన్నటువంటి ఒక రెడ్డి కులానికి చెందినటువంటి కుటుంబం మధ్యరాత్రి దాడులు చేసి అతి దారుణంగా కొట్టడం జరిగింది .ఏప్రిల్ నెల లో 2 సంగటనలు మే నెలలో ఒక సంగటన ఇవి కేవలం కాకతాళీయం కాదు ఏవో తగిన మత్తులో జరిగినటువంటి సంగటనలు కావు.2౦12 జూన్ 12న లక్షింపేట లో ఐదురుగురు దళితులని జంతులవులని నరికి చంపినట్టుగా చంపివేసారు .ఈ విదంగా ప్రతి నిత్యం కూడా క్రైస్తవుల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి హత్యలు మానబంగాలు జరుగుతున్నాయి సంగాల మీద,సంగా కాపరుల మీద  దాడులు జరుగుతున్నాయి.కొన్ని సంగటనలు బైటకి వస్తున్నాయి , అనేక సంగటనలు బైటకి రావడం లేదు.మనం ప్రతిరోజు వార్త పత్రికలలో చూసాం , టీవీ లలో చూసాం ,డిల్లీ లో ఒక యువతిని సామూహికంగా మానబంగం చేసి చంపివేసినటువంటి సంగటన మొత్తం దేశాన్ని కూడా కుదిపివేసింది. ఆ తరువాత నిర్భయ చట్టం కూడా వచ్చింది .ఎందుకు సమాజం లో ఇలాంటి అరాచకత్వం నడుస్తుంది,ఎందుకు సమాజం లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.చిన్న పిల్లల మిద లైంగిక వేదింపులు జరుగుతున్నాయి.తాగిన మత్తులో కన్నకుతుర్లని , సొంత చెల్లెళ్ళని చేరిపివేస్తున్నారు.ఎందుకిలా జరుగుతుంది దేవుడు తన పోలికలతో సృష్టించినటువంటి మనుషి ఎందుకు ఈ విధంగా ఎందుకు మృగంలా మారిపోతున్నాడు .సమాజం లో ఎక్కడ చుసినా కుడా అవినీతి ,దుర్మార్గం ,పేదరికం,అమానుషత్వం ,అరాచకత్వం దౌర్జన్యం దోపిడీ. శాంతి సమాదానం లేనటువంటి పరిస్థితి ఈరోజు సమాజం లో నెలకొని ఉంది.ఎందుకు సమాజం ఈ విదంగా కుళ్ళిపోతుంది.వున్నవాళ్ళు లేనివాళ్ళలో దోపిడీ చేయడం ,బలవంతుడు బలహీనుల మీద దౌర్జన్యం చేయడం,తాగిన మత్తులో విచక్షణ లేకుండా అనేక అరాచక క్రియలు చేయడం ,కామందుల దాహానికి యువతులు బలైపోవడం ,ముక్యముగా క్రైస్తవుల మీద దళితుల మిద ఈ విదంగా జరగుతున్నాయి .దిని ప్రధానమైనటువంటి కారణం బలహీనముగా ఉన్నటువంటి వాళ్ళ మీద బలవంతులు ఎప్పుడు కూడా దాడులు చేస్తారు .పాలితులు గా ఉన్నటువంటి వారిమీద పాలకులు ఎప్పుడు దాడులు చేస్తారు .సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడినటువంటి వాళ్ళు ,అనిచివేయబడినటువంటి వాళ్ళు ,అనగాద్రోక్కబడినటువంటి వాళ్ళమీద ఇలాంటి దోపిడీ దౌర్జన్యం చేస్తూనే ఉంటారు .పాలకులలో వాళ్ళ దగ్గర అధికారం,రెవిన్యూ వ్యవస్థ ,పోలిసు వవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ దీనికి ప్రదానమైన కారణం మనదేశం లో ఉన్న కుల వ్యవస్థ ప్రదానమైన కారణం, భూమి ,సంపద, పరిశ్రమలు ,వ్యాపారం అన్ని కూడా కొద్దిమంది చేతుల్లో ఉండడం వాళ్ళ ఈ బలహీన వర్గాలు ఎవరి దగ్గర ఐతే ఇవన్ని ఉన్నాయో వారి చేతిలో దాడులకి గురవుతూనే ఉన్నారు ,మద్యపానం కూడా దీనికి ఒక కారణం , మద్యపానం మానవజాతిని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ ,కాన్సర్ కంటే అతి ప్రమాదకరమైన వ్యాధి ,మద్యపానం వ్యాధి సోకింది అంటే సమాజం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది , సమాజం లో నేరాలు,దొంగతనాలు,దోపిడిలు జరుగుతున్నాయి,ఈ మద్యపానం వాళ్ళ వ్యక్తి ఆరోగ్యం పాడవుతుంది,అశాంతి నెలకొంటుంది ,సమాజం మొత్తం కూడా కుళ్ళి కంపు కొట్టి నశించిపోతుంది , బైబిలు గ్రంధం లో మద్యపానం గురించి 75 సార్లు వ్రాయడం జరిగింది. దిని ద్వారా జరిగే నష్టం గురించి బైబిల్ గ్రంధం లో పేర్కొనడం జరిగింది. మద్యపానాన్ని ప్రోత్సహించడం అనేది సాతాను చర్య.దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య .ఆంధ్రప్రదేశ్ లో లక్ష కోట్ల రూపాయల మద్యపాన క్రయవిక్రయాలు జరుగుతున్నాయి,సమస్య ఎంత తీవ్రంగా ఉందొ ఆలోచించండి. మద్యపానం కోసం ఉపయోగిస్తున్న రూపాయలని అభివృద్ధికి ఎందుకు ఉపయోగించకూడదు .మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లక్ష ముప్పైవేల కోట్ల రూపాయలు .అంటే దాదాపు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందొ అంత డబ్బు మద్యపానానికి వాడుతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి . ప్రబుత్వం ఈ మద్యం సిండికెట్ల మిద దడి చేసినపుడు ఎన్నో చెడు నిజాలు బయటికి వచ్చాయి , వాళ్ళ మిద తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి సిద్దపడినప్పుడు దానిని రాజకీయ నాయకులూ అడ్డుకోవడం జరిగింది.ఎందుకంటే ఈ మద్యం వ్యాపారం మొత్తం రాజకీయ నాయకుల అందదండలతోనే జరుగుతుంది.ఈ మద్యం వ్యాపారాల ద్వారా వచ్చిన నల్లదనాన్ని అంతా రాజకీయాలలో కర్చుపెట్టి రాజకీయ నాయకులూ అవుతున్నారు వాళ్ళు ఇంకా ఎక్కువగా దీన్ని ప్రోత్సహిస్తున్నారు,దీనిపలితాలు సమాజం మొత్తం మిద పడుతున్నాయి కుంటుంబాల మిద పడుతున్నాయి.ఎక్కడ చుసిన మద్యం షాపులు కిటకిటలాడుతున్నాయి.భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 47ప్రకారం మద్యపానాన్ని నిషేదించాలి,మనరాష్ట్రం లోనే రెండు లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయని అసిబి వాళ్ళు తెలియజేసారు.రిటైల్ షాప్స్ లైసెన్సుల ద్వారా 7౦౦౦ కోట్ల రూపాయలు ఆదాయం మన ప్రబుత్వానికి వస్తుంది.బార్ల ద్వారా దాదాపుగా ఐదువేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది,ప్రబుత్వం నడుపుతున్న 11 బ్రివరీస్ ద్వారా దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది .మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది.ఈ పరిస్థితి చూసి మనం తలదించుకోవాలో తల ఎత్తాలా ? గర్వించాలా? సిగ్గుపడాలా?సంతోషించాలా ? బాధపడాలా ? సమాజం  నాశనం అవుతుంటే ప్రజలు ఎంచేస్తున్నారు నీతిబోదలు చెప్పాల్సిన క్రైస్తవులు ఎం చేస్తున్నారు , చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి మనకి ఎందుకు మనసు రావడం లేదు.ఎందుకు ఆలోచించడం లేదు . అధికారికంగా అనధికారంగా జరుతున్న క్రయ విక్రయాలు అన్ని లెక్కల్లో లేదు.. గుంటూరు జిల్లా నడికుడి లో మద్యం షాపుని ఐదు కోట్ల ఇరవైఐదు లక్షలకి కొనుగోలు చేసారు.అంటే ఎంత వ్యాపారం జరుగుతుందో అర్థం అవుతుంది.dr.శ్యామిల్ 1989 లో వైన్ ఇన్ ది బైబిల్ అనే పుస్తకాన్ని వ్రాసి బైబిల్ మద్యపానాన్ని కండిస్తుంది అని చెప్పాడు . ఆదికాండం లో 9 వ అధ్యాయం ,లేవికందము లో 10వ అధ్యాయం , సంఖ్యాకండం లో 6వ అధ్యాయం ,ద్వితియోపదేశాకాండం21,29,32 అధ్యాయాలలో ,న్యాయదిపతులు 13వ అధ్యాయం లో ,1సమూయోలు ,2 సమూయోలు లో నలుగు వచనాలు,1 రాజులు మరియు ఎన్నో గ్రందాలలో  మద్యపానం గురించి వ్రాయడం జరిగింది . మనిషిని ఒక వ్యక్తి ని నాశనం లోకి నడిపిస్తుంది ,దేశాన్ని నాశనం చేస్తుంది సమాజం లో నేరాలు గోరాలు ఎన్నో జరుగుతున్నాయి మద్యపానం వల్ల. దీనివల్ల యువకులు చదువులు మానేస్తున్నారు.క్రైస్తవులుగా మనం అందరం కూడా మద్యపానాన్ని కండించాలి

No comments:

Post a Comment

Animated Social Gadget - Blogger And Wordpress Tips