బహుజనులరా - క్రైస్తవులారా! ఇంకేన్నాళ్లి రాజకీయ బానిసత్వం
ప్రపంచం లో ఏ సమాజం లో లేని కులవ్యవస్థ భారతదేశ సమాజం లో రాజకీయ ,ఆర్థిక ,సాంస్కృతిక వ్యవస్థ లో వేళ్ళునికొని హిందుమతంతో పెనవేసుకొని , ఒకదానిపై మరొకటిగా పేర్చబడ్డ కుల దొంతరల వ్యవస్థ సమాజాన్ని నిట్టనిలువుగా చిల్చేసింది . సాటి మనిషిని మనిషిగా చూడని సమాజాన్ని నిర్మించింది . ఈ వ్యవస్థ కోట్లాదిమంది ప్రజలకి కనీస మనవ హక్కులు లేకుండా ఊరిబయట చచ్చిన గొడ్ల శవాలకి చేరువ చేసి ,హీనమైన అనారోగ్యకరమైన పనులకి పరిమితం చేసి అంతరానికులాలుగా ముద్ర వేసింది ...
ఈ వ్యవస్థ లను ఖండించి మానవతా విలువలతో కూడిన నవసమజాన్ని స్థాపించడానికి గౌతమబుద్ధుడు నుండి బాబాసాహెబ్ అంబేడ్కర్ వరకు విశేష రాజకీయ,సామజిక,సంస్కరనోద్యమలు చేసారు. ఈ అట్టడుగు అంటారని కులాలకి రాజకీయ అధికారం వస్తేనే తప్ప ఈ వ్యవస్థ మార్పు చెందాడు అని ఆవిరళ కృషి చేసారు .
బాబాసాహెబ్ అంబేడ్కర్ క్రింది కులాలకి అధికారం కోసం ఉద్యమించి 1932 ఆగష్టు 17న కమ్యూనల్ అవార్డు రూపంలో ప్రత్యేక నియోజికవర్గాల ద్వారా రాజకీయ స్వతంత్రాధికారాన్ని సాదించారు . అయితే గాంధీ నాయకత్వాన 'మనువాద ' పాలక కులాలు ఆ స్వాతంత్ర్యాన్ని అడ్డుకొనడం వలన కేవలం రిజర్వేషన్లతో సర్దుకోవలసి వచ్చింది .
ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వలన కొంత మేలు జరిగి సాంప్రదాయ అంటరానితనం తగ్గినమాట వాస్తవమే . అయితే రాజకీయాల్లో పాలక వర్గాల కొమ్ముకాసే చెంచాలు ,దళారులు రాజకీయ పాలేర్లు వేలాదిగా పుట్టుకరావడం వలన ఈఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లో స్థూలమైన మార్పులు మాత్రం సాద్యం కావడం లేదు ఇక ఉద్యోగ రంగం లో లక్షలాది మంది అంటరాని కులాల వారు లబ్ది పొందుతున్నారు .........
No comments:
Post a Comment